ప్రభాస్, పూజా హెగ్దే హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా రాధేశ్యామ్. ఈ జులైలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ముంబైలో జరుగుతున్నాయి. అయితే, కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ రాధేశ్యామ్ రిలీజ్ పై పడనుందని టాక్ వినిపిస్తుంది.
ముంబైలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో అనుకున్నంత స్పీడ్ గా పనులు జరగటం లేదని… పైగా లాక్ డౌన్ విధిస్తారన్న ప్రచారం సినిమా యూనిట్ ను టెన్షన్ పెడుతున్నట్లు ఇన్ సైడ్ టాక్.
అయితే, తెలంగాణలో కరోనా కేసుల ఉధృతి తక్కువగా ఉన్న నేపథ్యంలో… అవసరం అయితే ముంబై నుండి పనులన్నీ హైదరాబాద్ షిఫ్ట్ చేసే ఆలోచన కూడా ఉందని తెలుస్తోంది. కానీ అనుకున్నంత స్పీడ్ గా పనులు అవుతాయా అన్న టెన్షన్ మాత్రం వీడటం లేదట.
రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతోంది.