ప్రభాస్ రాముడిగా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా ఆదిపురుష్. ప్రస్తుతం ముంబైలో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుంది. అయితే, ముంబైలో ఉన్న కరోనా పరిస్థితులు ఆదిపురుష్ చిత్రయూనిట్ ను టెన్షన్ పెడుతున్నాయి. తీవ్ర కరోనా ఆంక్షల నడుమ షూటింగ్ కొనసాగించాలని నిర్ణయించారు.
సెట్ లో షాట్ ఏదైనా 25మందికి మించి ఉండకుండా జాగ్రత్త తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రతి గంటకు ఓసారి సెట్ మొత్తాన్ని శానిటైజ్ చేయటం, అక్కడున్న వారు కూడా కరోనా నిబంధనలు పాటించేలా జాగ్రత్త తీసుకుంటున్నట్లు ఫిలింనగర్ సమాచారం.
ప్రస్తుతం ప్రభాస్, క్రితీ సనన్, సన్నీ సింగ్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు ఓంరావత్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా చిత్రీకరిస్తున్నారు. ప్రభాస్ ఏప్రిల్ 20వరకు ముంబైలో ఆదిపురుష్ షెడ్యూల్ పూర్తి చేసుకొని, హైదరాబాద్ లో సలార్ సెట్ లో జాయిన్ కానున్నాడు.