తిరుమలలో కరోనా మహమ్మారీ పంజా విసురుతోంది. తిరుమల వేద పాఠశాలలో చదువుకుంటున్న 50మంది విద్యార్థులు కరోనా బారిన పడ్డారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో వీరికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. ధర్మగిరి వేద పాఠశాలలో వైరస్ సోకినట్లు అధికారులు తెలిపారు.
వైరస్ బారిన పడ్డ విద్యార్థులను తిరుమల పద్మావతి కోవిడ్ కేంద్రానికి తరలించారు.
కొంతకాలంగా వైరస్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఏపీలో రెండంకెల స్థాయికి పడిపోయిన కొత్త కేసులు… మళ్లీ వందకు పైగా నమోదవుతున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది.