ఏపీలో కరోనా కోరలు చాస్తోంది. నమోదవుతున్న రోజువారీ కేసులు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈరోజు కొత్తగా 14,440 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 21,80,634కి చేరింది. అటు, మహమ్మారి దాటికి ఈ రోజు నలుగురు మృతి చెందారు. తూర్పు గోదావరి, ప్రకాశం, గుంటూరు, విశాఖలో ఒక్కో కరోనా మరణం సంభవించాయి. ఇప్పటి వరకూ 14,542 మందిని కరోనా మింగేసింది. ఈ రోజు 3,969 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 20,79,587 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఇంకా 83,610 మంది చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం విశాఖపట్నంలో అత్యధికంగా 15,695 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు తెలిపింది ఆరోగ్య విభాగం. ఆ తర్వాత చిత్తూరులో 11,047 కేసులు ఉండగా.. పశ్చిమ గోదావరిలో అత్యల్పంగా 1,943మంది చికిత్స పొందుతున్నారు. మిగతా అన్ని జిల్లాలలో మూడు వేలకుపైనే యాక్టివ్ కేసులు ఉన్నట్లు ఆరోగ్య విభాగం డేటాలో వెల్లడైంది.
భారీగా కేసులు నమోదవడంతో అధికారులు ఆంక్షలు కఠినతరం చేస్తున్నారు. మాస్కులు వాడకం, భౌతిక దూరం తప్పని సరి చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. రాత్రి 11 గంటల నుండి ఉదయం 5 వరకు ఈ నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుంది. అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇస్తూ ఈ ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో 200 మందికి,ఇండోర్ లో 100 మందికి మాత్రమే అనుమతి కల్పించింది. అయితే అంతరాష్ట్ర రవాణాకు మాత్రం అవకాశం కల్పించింది. సినిమా థియేటర్ల లో సీటు సీటుకు మధ్య గ్యాప్ కూడా ఉండాలని పేర్కొంది.