ప్రపంచమంతా కరోనా వైరస్ భయంతో ప్రాణాలను అరచేతితో పట్టుకుని బిక్కు బిక్కు మంటున్నారు. మరో వైపు భారత్ లో కూడా కరోనా మహమ్మారి బారిన పడి ఐదుగురు మృతిచెందారు . వందల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయిన నేపథ్యంలో ఎయిర్ పోర్ట్, రైల్వే స్టేషన్ లు,బస్సు స్టేషన్ లు అన్ని దగ్గర స్క్రీనింగ్ టెస్ట్ లను ఏర్పాటు చేశారు. అయితే మనదేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థిని ఆదమరచిన ఓ అధికారి సగటు ప్రయాణికుడికి ఆమడంతా దూరంలో మిషన్ పెట్టి ఫోన్ మాట్లాడు కుంటూ నిర్లక్యం గా స్క్రీనింగ్ టెస్ట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఒక వైపు ప్రధాన మంత్రి మోడీ తో సహా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకొండంటూ జాగ్రత్తలు చెప్తుంటే ఇక్కడ అధికారుల పనితీరుపై ఎంత నిర్లక్యంగా ఉందొ చూస్తే సిగ్గుగా ఉందంటూ నెటిజన్లు మండిపడుతున్నాడు. అతని నిర్లక్యం కారణంగా ఎంతో మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉందంటూ చివాట్లు పెడుతున్నారు. ఎంతపెద్ద విపత్తు వచ్చిన మన అధికారుల తీరు మారుతుందా అంటూ ప్రశ్నిస్తున్నారు..