ఒమిక్రాన్ తో ప్రమాదం ఏమి లేదని, అలాగే థర్డ్ వేవ్ లో వచ్చిన కరోనా తో కూడా పెద్దగా ఇబ్బంది లేదని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. అయితే ఆ అభిప్రాయం ను వెంటనే మార్చుకోవాలి అంటున్నారు అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంశాస్త్రవేత్తలు. కరోనాలో రాబోయే రోజుల్లో మరిన్ని వేరియంట్లు వచ్చే అవకాశం ఉందని వారు చెప్తున్నారు.
వారు చెబుతున్న మాటల ప్రకారం…. తొలిసారివెలుగుచూసిన కరోనా వేరియంట్ తో పోలిస్తే 4 రెట్లు, డెల్టా కంటే రెండు రెట్లు అధిక వేగంతో ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోందట. ఒమిక్రాన్ రోగనిరోధక శక్తి తక్కువ గా ఉన్న వ్యక్తుల్లోకి ప్రవేశిస్తే వారిలో ఎక్కువ కాలం ఉండి, మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.
కాలం గడిచేకొద్దీ వైరస్ లు తక్కువ ప్రాణాంతకంగా మారతాయని చెప్పేందుకు కూడా ఆధారాలేవీ లేవని…. అలాగే జంతువుల్లో కూడా ఈ వైరస్ ప్రవేశించి వివిధ రకాలుగా మారి వ్యాప్తి చెందే అవకాశం కూడా లేకపోలేదని అంటున్నారు. ఒమిక్రాన్, డెల్టా రెండు కూడా ప్రస్తుతం వ్యాప్తి దశలో ఉన్నాయని… ఈ రెండు ఒకే వ్యక్తిలో ప్రవేశిస్తే మిశ్రమ వేరియంట్ పుట్టుకొచ్చే అవకాశం ఉందని అంటున్నారు.