దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 34,973 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,31,74,954కు చేరుకుంది. తాజాగా 260 మంది మృతిచెందగా… మొత్తం మృతుల సంఖ్య 4,42,009కు పెరిగింది.
గురువారం 37,681 మంది కరోనా నుంచి బయటపడ్డారని ఆరోగ్యశాఖ తెలిపింది. మొత్తం రికవరీల సంఖ్య 3,23,42,299కి చేరింది. యాక్టివ్ కేసులు 3,90,646గా ఉన్నాయి.
కొత్తగా నమోదైన 34,973 కరోనా కేసుల్లో కేరళ నుంచే 26,200 ఉన్నాయి. అలాగే 260 మరణాల్లో 114 మంది అక్కడివారే. ఇక వ్యాక్సినేషన్ ప్రక్రియలో రికార్డ్ స్థాయిలో దూసుకుపోతోంది భారత్. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 72,37,84,586 మందికి టీకాల పంపిణీ జరిగింది.