తెలంగాణలో కరోనా కేసులు మరోసారి పెరిగాయి. కొత్తగా రాష్ట్రవ్యాప్తంగా 80,138 మందికి కొవిడ్ టెస్టులు చేయగా.. 2447 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,11,656కు పెరిగింది. కరోనాతో మరో ముగ్గురు మరణించారు.
దీంతో కరోనా మరణాల సంఖ్య 4,060కి చేరింది. ఈ మహమ్మారి నుంచి కొత్తగా 2295 మంది పూర్తిగా రికివరీ అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22197 యాక్టివ్ కొవిడ్ కేసులున్నాయి. రోజువారీ కేసుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ కేసులు వెలుగు చూస్తున్నాయి.
హైదరాబాద్‌లో 1112, మేడ్చల్‌లో 235, రంగారెడ్డిలో 183, సంగారెడ్డిలో 73, ఖమ్మంలో 63, హన్మకొండలో 80, మంచిర్యాలలో 68, భద్రాద్రికొత్తగూడెంలో 48 కేసులు బయటపడ్డాయి. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్డు చేపట్టింది. ఆర్టీపీసీఆర్ టెస్టుల సంఖ్య పెంచాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది.
రోజుకు లక్ష ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయాలంటూ తెలిపింది. కరోనా కట్టడికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. సామాజిక దూరం పాటించేలా, మాస్కుల ధరించేలా ప్రజలకు అవగాహన పెంచాలని తెలిపింది. కోవిడ్ వ్యాప్తి నియంత్రణకు మరింత అప్రమత్తత అవసరమని హైకోర్టు సూచించింది.