కరోనా వ్యాక్సినేషన్ ఓవైపు కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ కు చెక్ పెట్టాలంటే వ్యాక్సిన్ ఏకైక మార్గం అని అంతా ప్రచారం చేస్తున్నారు. ముందుగా హెల్త్ వర్కర్స్, ఫ్రంట్ లైన్ వారియర్స్ వ్యాక్సిన్ తీసుకుంటున్నారు. అయితే, అక్కడక్కడా వ్యాక్సిన్ తీసుకున్న వారు మృతి చెందుతున్న ఘటనలు కూడా రిపోర్ట్ అవుతూనే ఉన్నాయి.
తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రెంటికోటలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న మహిళా వాలంటీర్ పిల్లా లలిత మృతి చెందింది. వ్యాక్సిన్ వికటించి ఆదివారం ఉదయం ఆమె మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. రెండు రోజుల క్రితం వాలంటీర్ లలిత వ్యాక్సిన్ వేయించుకుంది.
అయితే, ఆమె మరణానికి వ్యాక్సిన్ కారణమా…? ఇతర ఆరోగ్య సమస్యలున్నాయా…? అన్నది అధికారికంగా తెలియాల్సి ఉంది.