ఇండియాలో కరోనా వ్యాక్సిన్ వచ్చేందుకు మార్గం సుగుమం కావటంతో వ్యాక్సిన్ ఎట్లా ఇవ్వాలో డ్రైరన్ నిర్వహిస్తున్నారు. వ్యాక్సిన్ రవాణా, ఎలా వేయాలి, వ్యాక్సిన్ ఎలా నిల్వ చేయాలి అనే అంశాలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు ఈ డ్రైరన్ నిర్వహిస్తుంటారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 4 రాష్ట్రాల్లో నిర్వహించగా… శనివారం నుండి దేశంలోని ప్రతి రాష్ట్రంలో నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో రెండు జిల్లాల్లో డ్రైరన్ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో డ్రైరన్ కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలో మూడు సెంటర్లలో కరోనా వైరస్ వ్యాక్సినేషన్ డ్రైరన్ నిర్వహిస్తున్నారు. గాంధీ, యశోద ఆస్పత్రితో పాటు తిలక్ నగర్ పీహెచ్‌సీలో డ్రైరన్ నిర్వహిస్తున్నారు. ఒక్కో సెంటర్‌లో 25మంది హెల్త్ వర్కర్లకు డమ్మీ వ్యాక్సినేషన్ ఇవ్వనునున్నారు. దీనికోసం అధికారులు అన్ని రకాల జాగ్రత్తలు, ఏర్పాట్లు పూర్తి చేశారు.
వ్యాక్సిన్ తర్వాత అరగంట పాటు వారిని వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నారు.