ఓ వైపు వ్యాక్సినేషన్ వేగంగా సాగుతున్నా.. మరోవైపు కరోనా కేసులు దేశాన్ని కలవరపెడుతున్నాయి. దీoతో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. వ్యాక్సినేషన్ వేగం పెరిగితే కానీ ఈ మహమ్మారికి అడ్డుకట్టవేయలేమని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు త్వరలోనే 45 ఏళ్లు పైబడిన వారందరికీ కూడా టీకా అందించేందుకు ఆలోచన చేస్తోంది.
ఇప్పటి వరకు రెండు దశల్లో టీకా పంపిణీ చేశారు. మొదటిదశలో హెల్త్ వర్కర్స్, రెండో దశలో 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, అలాగే 45 ఏళ్లు దాటిన దీర్ఘవ్యాధిగ్రస్తులకు టీకా వేస్తున్నారు. కాగా ఇప్పుడు 45 ఏళ్లు దాటిన వారందరికీ టీకాలు వేయాలని కేంద్రం ఆలోచిస్తోంది. వీలైనంత త్వరలో ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్టు అధికారులు కూడా చెప్తున్నారు.