దేశ ప్రజలకు కరోనా వ్యాక్సిన్ ను త్వరలోనే అందుబాటులోకి తెస్తామని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. వ్యాక్సిన్ చివరి దశలో ఉందని, కరోనా వైరస్ పై భయపడాల్సిన అవసరం లేదని ప్రధాని ప్రకటించారు.
వ్యాక్సిన్ రాగానే దేశప్రజలకు అందించేందుకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపిన ప్రధాని, యూకే నుండి వచ్చిన కొత్త స్ట్రెయిన్ తో భయపడాల్సిన పనిలేదన్నారు.
కాగా, ఇండియాలో ఆక్స్ ఫర్డ్ యూనిర్శిటీ-అస్ట్రాజెనికా తయారు చేసిన కోవీశిల్డ్, భారత్ బయోటెక్ కోవాక్జిన్ వ్యాక్సిన్ లకు త్వరలో అత్యవసర వ్యాక్సినేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వ్యాక్సిన్ థర్డ్ ఫేజ్ క్లినికల్ ట్రయల్స్ పై నిపుణుల కమిటీ రెండుసార్లు సమావేశమై, మరింత డేటా కోరింది. కోవీశిల్డ్ కు ఇప్పటికే బ్రిటన్ అనుమతిచ్చిన నేపథ్యంలో… ఇండియాలోనూ అనుమతి వచ్చే అవకాశం ఉంది.