కరోనా చికిత్స కోసం అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా నుమతి పొందిన కొవాగ్జిన్, కొవిషీల్డ్ రవాణాకు సర్వం సిద్ధమైంది. నేడు లేదా రేపటి నుంచి వ్యాక్సిన్ల పంపిణీ చేయనున్నట్టు కేంద్రం తెలిపింది. విమానాల్లో టీకాలను రాష్ట్రాలకు చేరుస్తామని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్పష్టం చేశారు. పుణె కేంద్రంగా వ్యాక్సిన్ల సరఫరా జరుగుందని ఆయన వెల్లడించారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆరోగ్యశాఖ మంత్రులతో ఆయన వర్చువల్‌గా సమావేశమయ్యారు. వ్యాక్సిన్ రవాణా, పంపిణీతో పాటు పలు అంశాలపై వారితో చర్చించారు.
దేశంలో కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్నాయని..ఈ సమయంలో మరింత అప్రమత్తత అవసరమని కేంద్ర మంత్రి సూచించారు. దేశంలో ప్రతిఒక్కరికీ వ్యాక్సిన్ అందించేందుకు కృషి చేస్తున్నామన్న ఆయన.. వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. కరోనా వారియర్లకు తొలుత వ్యాక్సిన్ ఇవ్వాలని ఎక్స్‌పర్ట్ కమిటీ సూచించిందని ఆయన తెలిపారు.