దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోని ముఖ్య కేంద్రాలకు వ్యాక్సిన్ పంపిణీ పూర్తయింది. ఎల్లుండి (జనవరి 16) నుంచి దేశవ్యాప్తంగా మొదలుకానున్న ఈ కార్యక్రమంలో.. తొలి రోజు ఎవరెవరికీ వ్యాక్సిన్ ఇవ్వాలనే దానిపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు పకడ్బందీగా జాబితాను సిద్ధంగా ఉంచుకున్నాయి. అయితే తొలి రోజు దేశవ్యాప్తంగా మొత్తం 3. లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్దేశిత లక్ష్యంగా పెట్టుకుంది.
దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ కోసం మొత్తం 2934 సెంటర్లను ఏర్పాటు చేయగా.. ఒక్కో సెంటర్‌లో 100 మందికి తక్కువ కాకుండా టీకాలు ఇవ్వాలని కేంద్రం సూచించింది. అలాగే ఇందుకు అవసరమైన డోసులతో పాటు అదనంగా కూడా సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్రాలకు మార్గదర్శకాలు జారీ చేసింది. అలా.. తొలి రోజు వ్యాక్సినేషన్‌లో మొత్తం 3 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి వ్యాక్సిన్ వేయనున్నారు.