కరోనా వైరస్ ను కట్టడి చేసే వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఇంకా అహర్నిశలు కష్టపడుతోంటే… బ్రిటన్ మాత్రం అన్నిటికంటే ఓ అడుగు ముందుకేసింది. ఫైజర్-బయోఎన్‌టెక్ కరోనా వైరస్ వ్యాక్సిన్ వినియోగానికి ఆ దేశ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే వారంలోనే దేశవ్యాప్తంగా ఈ వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది.
ఫైజర్-బయోఎన్‌టెక్ కరోనా వైరస్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతించాలని మెడిసిన్స్ అండ్ హెల్త్‌కేర్ ప్రోడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ చేసిన సిఫారసును బ్రిటన్ ప్రభుత్వం ఆమోదించింది. దీనిపై ఫైజర్ సంస్థ ఆనందం వ్యక్తం చేసింది. మరిన్ని దేశాల అనుమతుల కోసం తాము ఎదురు చూస్తున్నామని తెలిపింది.