ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను అంతమొందించేందుకు ప్రపంచ దేశాలన్నీ పని చేస్తున్నాయి. ఓవైపు నివారణ మందు కనిపెట్టే ప్రయత్నాలు, మరోవైపు వైరస్ ఏం చేయకుండా ఉండేందుకు వ్యాక్సిన్ తయారు చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు మొదలైయ్యాయి.
ఇప్పటికే మనుషులపై ట్రయల్స్ కూడా చేసి కరోనా వ్యాక్సిన్ పై ఆశలు రేకేత్తించింది ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటి. దాదాపు వెయ్యి మంది వాలంటీర్లపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ చేశారు. వారిలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కనిపించలేదు. పైగా కరోనా వైరస్ ఊపిరితిత్తులపై దాడి చేయకుండా వ్యాక్సిన్ అదుపు చేయగలుగుతుందని తేలింది. దీంతో ఇప్పుడు కోతులపై ట్రయల్స్ చేస్తుంది సంస్థ.
దాదాపు ఆరు కోతులకు కరోనా వైరస్ ఇచ్చి… ఆ తర్వాత వ్యాక్సిన్ ట్రయల్స్ చేశారు. బుధవారం ఈ ట్రయల్స్ జరగ్గా… ఇప్పటికైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనట్లు తెలుస్తోంది. కానీ 2003లో వచ్చిన సార్స్ వైరస్ గ్రూపుకే ఇది కూడా చెందినది కావటంతో తనను తాను రూపాంతరం చేసుకునే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. వ్యాక్సిన్ ద్వార వైరస్ పై పోరాడగల అతి శక్తవంతమైన యాంటీ-బాడీస్ ను తయారు చేయగలగటం అతి పెద్ద సమస్యగా మారుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటి వరకు మనుషుల్లో, కోతులపై జరిగిన ట్రయల్స్ పై వచ్చిన ఫలితాలను… కేస్ స్టడీస్ ను బట్టి మూడో దశ మనుషులపై క్లినికల్ ట్రయల్స్ చేయనున్నారు. ఆ తర్వాత స్టడీస్ ను బట్టి వ్యాక్సిన్ ఎంత ప్రభావం ఉంది, కరోనా వైరస్ తో పోరాడి నిర్మూలించగలుగుతుందా… ఇంకా ఎదైనా మార్పులు చేయలా అనే అంశంపై పరిశోధన జరగనుంది.
ఆక్స్ ఫర్డ్ పరిశోధనలు విజయవంతం అయితే… ఇండియాలోనూ ఆక్స్ ఫర్డ్ తో టై అప్ అయిన ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్ ప్రొడ్యూస్ చేసేందుకు రెడీగా ఉండటం ఊరటనిచ్చే అంశం.