ఇండియాలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. రోజు రోజుకి రికార్డుస్థాయిలో కేసులు వెలుగుచూస్తున్నాయి. నిన్న ఒక్కరోజే ఏకంగా 62 వేల 498 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. దేశంలో ఒక్కరోజులోనే 60వేలకు పైగా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. గత నెల 31న అత్యధికంగా 57 వేల 151 కేసులు బయటపడగా.. ఆ తర్వాత ఇదే కొత్త రికార్డ్.
తాజా కేసులతో కలిపి దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 20 లక్షలు దాటింది. ఇప్పటివరకు 20 లక్షల 27 వేల 34 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. ఇందులో 13లక్షల 78వేలకు పైగా రోగులు కోలుకోగా.. మరో 6లక్షల 7వేలకు పైగా బాధితులు చికిత్స పొందుతున్నారు. ఇక నిన్న ఒక్క రోజే దేశవ్యాప్తంగా మరో 886మంది కరోనాతో ప్రాణాలు కోల్పోగా…దేశంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 41 వేల 585కి చేరింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో తీవ్రత అధికంగా ఉంది.
ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 68శాతానికి పెరిగినట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. మరణాల రేటు 2.07శాతంగా ఉన్నట్టు వెల్లడించంది.