
దేశంలో కరోనా స్పీడ్ తగ్గలేదు. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 66,999 కేసులు నమోదు కాగా, 942 మంది మృతి చెందారు. మరోవైపు గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 56,383 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
దేశంలో మొత్తం 23,96,645 కేసులు నమోదు కాగా ప్రస్తుతం యాక్టివ్ కేసులు 6,53,622 ఉన్నాయి. 16,95,982 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా ఇప్పటివరకు 47,033 మంది కరోనా వ్యాధితో మరణించారు. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 70.38 శాతంగా ఉంది.