కరోనా బాధిత దేశాల్లో ఇండియా రికార్డు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా నమోదవుతున్న రోజూవారీ కేసుల్లో టాప్ ప్లేస్‌లో కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 52 వేలకు పైగా కేసులు నమోదుకాగా.. ఈ సంఖ్య ప్రపంచంలో ఇతర దేశాల్లో నమోదైన అన్ని దేశాల్లో కంటే అధికం.
గత 24 గంటల్లో భారత్‌లో 52 వేల 50 కరోనా కేసులు నమోదుకాగా.. మొత్తం కరోనా కేసుల్లోనే అగ్రభాగాన ఉన్న అమెరికాలో ఈ సంఖ్య 48 వేల 622 మాత్రమే. ఇక కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్న బ్రెజిల్‌లో 17 వేల 988, ఫిలిప్పీన్స్ లో 13 వేల 226 , కొలంబియాలో10 వేల 199 మంది గడిచిన 24 గంటల్లో వైరస్ బారినపడ్డారు. అంటే రోజువారీ కేసుల్లో ఇండియానే మొదటి స్థానానికి చేరినట్టయింది. గడిచిన 4 రోజుల్లో కూడా ఇండియాలోనే అత్యధికంగా కేసులు నమోదుకావడం కలవరపరుస్తోంది.