మీరు ఒంటరిగా ఉంటున్నారా… మీకు ఎవరైనా సెక్స్ పర్ట్నర్ ఉన్నారా… అయితే మీ పట్నర్ తో మీరు సెక్స్ చేసుకోవడానికి ప్రభిత్వం అనుమతి ఇచ్చింది. కరోనా జాగ్రతలు తీసుకుంటూనే మీరు మీ పని చేసుకోవచ్చు. ఇది మన దేశం లో అనుకునేరు కాదండి డచ్ ప్రభుత్వం అక్కడి ప్రజలకు ఇచ్చిన బంపర్ ఆఫర్ ఇది.
గత రెండు నెలలుగా ఒంటరిగా ఉంటున్న వాళ్లకు డచ్ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఎవరితో అయినా సెక్స్ చేసుకోవచ్చు అని ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ నేపథ్యంలో గత రెండు నెలలుగా సెక్స్‌కు దూరంగా ఉంటున్నారని, అలాంటివారు తమ పార్టనర్‌ను వెతుక్కొనేందుకు అవకాశం కల్పించాలని డచ్ నేషనల్ ఇన్ స్ట్యూట్ ఫర్ పబ్లిక్ హెల్త్, ఎన్విరాన్మెంట్ సిఫార్సు చేసింది. ‘‘వీలైతే ఒక వ్యక్తిని మీ సెక్స్ పార్టనర్‌గా ఎంచుకోండి. మీకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు కలగవనే నమ్మకం కలిగితేనే కలుసుకోండి. అంటే మీకు అల్రెడీ ఎవరైనా సెక్స్ పార్టనర్లు ఉండి ఉంటే.. వారినే కలవండి. కానీ, ఒక్క విషయం గుర్తుంచుకోండి.. మీరు ఎంత ఎక్కువ మందిని కలిస్తే.. కరోనా వైరస్ ముప్పు కూడా అంతే పెరుగుతుంది’’ అని పేర్కొంది.