కరోనా వైరస్ ఇప్పటి వరకు ఊపిరితిత్తులు, హృద్రోగ సమస్యలు సృష్టిస్తుందని వైద్యులు అంచనా వేశారు. కానీ పురుషుల లైంగిక సామర్థ్యం, సంతాన ఉత్పత్తిపై కూడా కరోనా ప్రభావం ఉందని తాజా అధ్యయనం బయటపెట్టింది. కరోనా వైరస్ వల్ల వీర్యం నాణ్యత దెబ్బతింటుందని, ఫలితంగా సంతాన సమస్యలొస్తాయని తెలిపింది.
అయితే, ఊపిరితిత్తులను డ్యామెజ్ చేసినంతగా… కరోనా వైరస్ సంతానోత్పత్తిపై ప్రభావం ఉండబోదని, వీర్యం నాణ్యతపై ప్రభావం పడినా… సంతానోత్పత్తిని పూర్తిగా దెబ్బతీస్తుందని చెప్పలేమంటున్నారు. ప్రభావం అయితే ఉంటుందని ఆ అధ్యాయనం చెప్తోంది.
వైరస్ శరీరంలోని ఎంటరవ్వగానే ఊపిరితిత్తులు సహా ఇతర శరీర భాగాలపై ఎలా ప్రభావం చూపుతుందో, అలాగే పునరుత్పత్తి అవయవాలపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులంటున్నారు. కానీ ఊపిరితిత్తులు డ్యామెజ్ అయ్యేంతగా పునరుత్పత్తి అవయవాలు, హార్మోన్ల విడుదలపై ప్రభావం చూపించటం లేదన్నారు. వీర్య కణాల ఉత్పత్తి, ఆక్సీకరణపై మాత్రం ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని తేల్చిచెబుతున్నారు.