ప్రపంచవ్యాప్తంగ ప్రజలను భయాందోళనకు గురిచేసిన కరోనా వైరస్ ప్రస్తుతం చైనా ఉత్పాదక రంగాన్ని కారు మబ్బులతో కమ్మేసింది. కరోనా దెబ్బకు చైనాలో ఫ్యాక్టరీలన్నీ మూతపడటంతో… ఆ ప్రభావం భారత్ వంటి చైనాపై ఆధారపడ్డ దేశాలపై పడింది. ముఖ్యంగా టెలివిజన్ లో ఎక్కువగా ఉపయోగించే ఓపెన్ సెల్ టెలివిజన్ ప్యానెల్ సరఫరాకు అంతరాయం కలగటంతో భారత్ కు కూడా ఆ దెబ్బ తగిలింది. భారత్ కు దిగుమతి అవుతున్న ఓపెన్ సెల్ టెలివిజన్ ప్యానెల్ ఎక్కువగా చైనా నుంచే వస్తున్నాయి.
కరోనా ప్రభావంతో ఉత్పత్తి నిలిచిపోవటంతో భారత దేశానికి సరఫరా ఆగిపాయింది. దీంతో దేశీయంగా టీవీల తయారీకి ఆటంకం కలగటంతో మార్కెట్ లో ఉత్పత్తి లేక అందుబాటులో ఉన్న ప్యానెల్ లు రేట్లు పెరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉందని మార్కెట్ వర్గాలు చెప్తున్నాయి. టీవీ ధరలు పెరిగే అవకాశం కనపడుతోంది. ఏదైతే చైనా నుంచి వస్తున్న ప్యానెల్ ధర టీవీ ధరలో 60% ఉండటం గమనార్హం. మరో వైపు చైనా లో కొన్ని కర్మాగారాలు తెరుచుకున్నప్పటికీ పరిమిత స్థాయిలో కార్మికులతో నడుస్తుంది. మునుపటిలా పూర్తి స్థాయిలో ఉత్పత్తి రావట్లేదు. ఈ క్రమంలో మార్చిలో కనీసం టీవీ ధరలు 10 % పెరగటం ఖాయమని ఎస్‌పీపీఎల్ సీఈవో అవ్ నీత్ సింగ్ మర్వా అన్నారు. భారత దేశ డిమాండ్ కు అనుగుణంగా చైనాలో ప్యానెల్ తయారీ సంస్థలు ఉత్పత్తిని పునరుద్దరించాలంటే కనీసం మూడు నెలల సమయం పడుతుందని తెలిపారు.
ప్రస్తుతం మార్కెట్ పరిస్థుతుల దృష్ట్యా ఉత్పత్తి 30 నుంచి 50% శతంకు పడిపోయే వీలుందని కూడా ఎస్‌పీపీఎల్ సీఈవో అవ్ నీత్ సింగ్ మర్వా చెప్పుకొచ్చారు. ఇప్పటికే డీప్ ఫ్రీజర్ల ధరలు 2.5 శాతం పెరిగాయని, రిఫ్రిజిరేటర్, ఎయిర్ కండీషనర్ ల ధరలు పెరుగుదల ఉండవచ్చని పరిశ్రమ నిర్వాహుకులు చెప్తున్నారు.