కరోనా కరాళ నృత్యం చేస్తోంది. కరోనా కట్టడికి ప్రభుత్వాలు ఎన్ని చర్యలు తీసుకుంటోన్న డోంట్ కేర్ అన్నట్లుగా తన ప్రతాపాన్ని చూపిస్తోంది ఈ
మహమ్మారి. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఎప్పుడు తగ్గుముఖం పడుతుందా అనే తలుస్తోన్న దేశ ప్రజానీకానికి ఆశాభంగం కల్గుతుంది. తాజాగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే కరోనా కేసుల సంఖ్య 1,000 దాటిపోగా, మరణాలు 26కు చేరుకున్నాయి. తాజాగా, గుజరాత్‌లో ఆదివారం ఉదయం మరో వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. దీంతో దేశంలో కరోనా మరణాలు 26కు చేరాయి. కాగా,ఇప్పటివరకూ 87 మంది కరోనా నుంచీ బయటపడి… ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు.
ఇండియాలో కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెండుతోన్న మహారాష్ట్రలో 186 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వగా..కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విషయంలో మహారాష్ట్రతో కేరళ పోటీ పడుతుందా అని అనిపించేలా కేరళలో 182 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ రెండు రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతుండటంతో ఆయా రాష్ట్రాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇక, వేయికి చేరుకొన్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రానురాను మరింత పెరుగుతుందనే ఆందోళనతో… ఇండియాలో దక్షిణ కొరియా అవలంభించిన విధానాన్ని అమలు చేయాలనీ భారత్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ముంచుకోస్తోన్న ప్రమాదాన్ని నివారించాలంటే దక్షిణ కొరియా తరహాలో ‘టీ 3’ ఆచూకీ, పరీక్ష, చికిత్స వ్యూహాన్ని అనుసరించాలని నిపుణులు సూచిస్తున్నారు. కరోనా అనుమానితుల జాడను కనుక్కొని త్వరగా వారికీ పరీక్షలు నిర్వహిస్తే ప్రమాదం నుంచి బయటపడతామని అంటున్నారు. ఇప్పటికే దక్షిణ కొరియా తరహ విధానాన్ని కర్ణాటకలో అమలు చేయనున్నామని యడ్డీ సర్కార్ ప్రకటించడం విశేషం.