ఏడాదిన్నర కాలం గడుస్తున్నా కరోనా మహమ్మారి విజృంభన మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. కేసులు మరణాల సంఖ్య తగ్గినా ఆసుపత్రుల్లో చేరుతున్న వారు చేరుతూనే ఉన్నారు. కొంతమందికి స్వల్ప లక్షణాలతో హోమ్ ఐసోలేషన్ లో చికిత్స తీసుకుంటుండగా మరికొంత మందికి తీవ్ర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇప్పటికి కూడా మరణాల సంఖ్య నమోదవుతూనే ఉంది. ఇక ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్నాయి.
మొత్తం దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో 37 జిల్లాలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అంతేకాకుండా 44 జిల్లాలో కరోనా పాజిటివిటి రేటు 10 శాతం కంటే ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది. ఐదు రాష్ట్రాలలో పాజిటివిటి రేటు ఎక్కువ ఉందని కేంద్రం ప్రకటించింది. మరోవైపు దేశంలో నమోదవుతున్న కేసులలో సగం కరోనా కేసులు కేరళలోనే నమోదవుతున్నాయని పేర్కొంది.
కరోనా మహమ్మారి తీవ్రత ఇంకా తగ్గుముఖం పట్టలేదని కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని సామాజిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించడం మర్చిపోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతూనే ఉన్నారు. దేశంలో కరోనా తీవ్రత తగ్గుముకం పట్టినప్పటికీ పూర్తిగా వైరస్ వ్యాప్తి తగ్గలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిందే అని వైద్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా వ్యాక్సినేషన్ తీసుకున్న వారిలో సైతం ఇంత త్వరగా ఇమ్యూనిటీ పెరగలేదని దానికి సమయం పడుతుందని చెబుతున్నారు.