కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదివారం జనతా కర్ఫ్యూకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దేశప్రజంతా కూడా ఆదివారం ఉదయం గం.7 నుంచి రాత్రి గం. 9 వరకు బహిరంగ ప్రదేశాలలోకి రాకుండా ఇంటి వద్దనే ఉండాలని మోడీ పిలుపుకు టాలీవుడ్ యాక్టర్స్ ఒక్కొక్కరుగా స్వాగతిస్తున్నారు. అందులో భాగంగా టాలీవుడ్ అగ్ర కథానాయకుడు చిరంజీవి జనతా కర్ఫ్యూలో అందరూ పాల్గొనాలంటూ ఓ వీడియో సందేశాన్ని పంపారు.
కరోనా వైరస్‌ను నియంత్రించడానికి 24 గంటలు పనిచేస్తున్న డాక్టర్స్, నర్సులు, ఇతర ఆరోగ్య బృందానికి, స్వచ్ఛ కార్మికులకు, పోలీసులకు ప్రశంసించాల్సిన సమయమిది. దేశ ప్రధాని పిలుపుకు స్పందిస్తూ ఆదివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 9 గంటల వరకు మనం అందరం స్వచ్ఛందంగా జనతా కర్ఫ్యూని పాటిద్దాం. ఇళ్లకే పరిమితమవుదాం. సరిగ్గా సాయంత్రం 5 గంటలకు ప్రతి ఒక్కరూ మన గుమ్మాల్లోకి వచ్చికరతాళ ధ్వనులతో సేవలందిస్తున్నవారికి ధన్యవాదలు తెలపాలని సందేశాన్ని ఇచ్చారు.