దేశంలో కరోనా సెకండ్ వేవ్ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా.. కేంద్రం మరోసారి అఖిలపక్షo సమావేశం నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రధాని మోదీ అధ్యక్షతన డిసెంబర్ 4వ తేదీన (శుక్రవారం) ఈ భేటీ జరపాలని భావిస్తోంది. ఈ భేటీకికి పార్లమెంట్ ఉభయ సభల్లోని ఆయా పార్టీలకు చెందిన పార్లమెంటరీ పక్ష నేతలు వర్చువల్ పద్ధతిలో పాల్గొంటారు. ఈ సమావేశాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సమన్వయం చేయనున్నట్టు సమాచారం.
దేశంలో కరోనా వ్యాప్తి మొదలైన తర్వాత జరిగే రెండో అఖిలపక్ష సమావేశం ఇది. పార్లమెంటరీ పక్ష నేతలతో పాటు హోంమంత్రి అమిత్ షా, ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్దన్, రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో పాటు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ, సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ హాజరవుతారు. కరోనా విజృంభణతో పాటు పార్లమెంట్ శీతాకాలు, బడ్జెట్ సమావేశాలను ఒకేసారి నిర్వహించే అంశంపైనా ఈ సమావేశంలో చర్చ జరగనుందని తెలుస్తోంది.