కరోనా వైరస్ తో తాజాగా మరో ఇద్దరు చనిపోయారు. చనిపోయిన వారిలో ఒకరు బీహార్, మరొకరు ముంబైకి చెందిన వారు.దీంతో ఇప్పటి వరకు చనిపోయిన వారి సంఖ్య 6 కు చేరింది.కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. శనివారం రాత్రి వరకు మొత్తం బాధితుల సంఖ్య 315 కు చేరిందని అధికారులు ప్రకటించారు. . 315 మంది బాధితుల్లో 22 మందికి నయం కావడంతో డిశ్యార్జ్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా 3 లక్షల మంది వైరస్ బారిన పడ్డారు. 13 వేల మంది చనిపోయారు.
మరో వైపు వైరస్ ను నియంత్రించడం కోసం దేశ ప్రజలంతా ఎవరి ఇళ్ల దగ్గరే వాళ్లే ఉండాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. దేశ వ్యాప్తంగా జనతా కర్ఫ్యూను పాటిస్తున్నారు. దీంతో దేశ రాజధాని ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల్లోనూ రోడ్లన్నీ ఎడారులను తలపిస్తున్నాయి.
బాధితుల సంఖ్య పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. రాజస్థాన్ లో మార్చి 31 వరకు పూర్తి షట్ డౌన్ ప్రకటించింది. అన్ని మాల్స్, షాప్స్, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ను సస్పెండ్ చేశారు. పేద ప్రజలకు ఆహార పొట్లాలు, గోదుమలు పంపిణీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. పంజాబ్ కూడా ప్రజా రవాణాను నిలిపివేసింది. గుజరాత్ లోని అహ్మదాబాద్, సూరత్, రాజ్ కోట్, వదోదర నగరాల్లో బుధవారం వరకు షట్ డౌన్ ప్రకటించారు. నిత్యావసర సరుకులైన కూరగాయలు, పాలు, మెడికల్ షాపుల మాత్రమే తీసి ఉంచాతారు. తిరుమలతో పాటు దేశంలోని ప్రముఖ దేవాలయాలు, పర్యాటక ప్రాంతాలను మూసి వేశారు. దేశంలో రైళ్ల రాకపోకలను ప్రభుత్వం రద్దు చేసింది. మార్చి 25 వరకు అన్ని రైళ్లను రద్దు చేసినట్టు తెలిసింది.
మహారాష్ట్రలో అత్యధికంగా 63 కేసులు నమోదయ్యాయి. వారిలో ముగ్గురు విదేశీయులున్నారు. ఆ తర్వాత కేరళలో 40 కేసులు నమోదయ్యాయి.