దేశంలో యూకే స్ట్రెయిన్ కరోనా కేసులు మళ్లీ బయటపడుతున్నాయి. నిన్న ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఇక ఊరట లభించినట్టేననుకున్న సమయంలో.. ఇవాళ కొత్తగా మరికొందరిలో కొత్త రకం కరోనా వైరస్ బయటపడింది. ఇవాళ మరో ఆరు కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 96కు పెరిగినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించింది.
బాధితులకు ఆయా రాష్ట్రాల్లోనే ప్రత్యేక ఐసోలేషన్ సెంటర్లలో చికిత్స అందిస్తున్నట్టు తెలిపింది. అలాగే వారి కుటుంబ సభ్యులు, వారితో పాటు ప్రయాణించినవారికి టెస్టులు చేస్తున్నట్టు వివరించింది. శనివారం నాటికి దేశంలో యూకే రకం కేసుల సంఖ్య 90గా ఉంది. నిన్న కేసుల సంఖ్య జీరో అని ఆరోగ్యశాఖ ప్రకటించింది.
కాగా ఇప్పటికే బ్రిటన్ నుంచి వస్తున్న ప్రయాణికులకు ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తోంది ప్రభుత్వం. కరోనా నెగెటివ్ వచ్చినా.. కచ్చితంగా 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని సూచిస్తోంది. కొత్త రకం వైరస్‌కు సంక్రమణ తీవ్రత ఎక్కువని చెప్పడంతో.. దేశంలో ఆందోళన నెలకొంది.