కరోనా వైరస్ సోకిందని ఎక్కడి నుండి వినాల్సి వస్తుందో అన్న భయం గుప్పిట్లో ప్రజలు ఉలిక్కిపడేలా… నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. కరోనా లక్షణాలున్నయన్న అనుమానంతో ఓ వ్యక్తిని ఐసోలేషన్ వార్డుకు తరలిస్తున్న సందర్భంలో ఆ వ్యక్తి పరారు కావటం కొద్దిసేపు జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ రేపింది.
మహారాష్ట్రలోని తమ బంధువుల ఇంటికి వెళ్లి వచ్చిన ఓ యువకుడు జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతూ జిల్లా ఆసుపత్రికి వచ్చాడు. కరోనా లక్షణాలను గమనించిన వైద్యులు ఐసోలేషన్ వార్డుకు పంపించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే…. మా ఇంట్లో వాళ్లకు ఈ విషయం చెప్పి వస్తానంటూ వెళ్లిన సదరు వ్యక్తి మళ్లీ తిరిగి రాలేదని తెలుస్తోంది. అయితే… ఈ అంశాన్ని సూపరిండెంట్ నాగేశ్వర్రావు దృవీకరించలేదు.