ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌కు మద్యపానంతో చెక్ పెట్టొచ్చంటున్నారు బ్రిటన్ ఉపాధ్యాయుడు. ఈ ప్రాణాంతక వ్యాధిని వైన్ చెక్ పెడుతుందని, అందుకు తానే ఉదాహరణ అంటున్నాడు. చైనాలోని వుహాన్‌లో ఇంగ్లీష్ టీచర్‌గా ఉంటున్న బ్రిటన్‌కు చెందిన కానర్ రీడ్ చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
రెండు నెలల క్రితం నేను తీవ్రమైన దగ్గు, జలుబుతో పాటు న్యూమోనియా లక్షణాలతో వైద్యులను సంప్రదించాను. శ్వాస తీసుకోవటం కూడా కష్టంగా మారిపోయింది. ఎక్కడకెళ్లినా బ్రీత్ అనలైజర్‌ను వెంట తీసుకెళ్లే వాడిని. దీంతో నన్ను పరీక్షించిన వైద్యులు ఏదో వైరస్ ఉన్నట్లు అనుమానించి ఆంటీబయోటిక్ మందులు ఇచ్చినా… నేను ఒప్పుకోలేదని తెలిపాడు.
అయితే, ప్రతి రోజు ఒక గ్లాస్ వెచ్చని విస్కీలో తేనె కలుపుకొని తాగే వాడినని, ఇలా ప్రతి రోజు తీసుకోవటం వల్ల తన హెల్త్ ఇంప్రూవ్ అయ్యిందని, క్రమేణా తనలో ఉన్న వైరస్ కూడా పోయిందని తెలిపాడు. అయితే… కాస్త ఎక్కువగా రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుందని, వైన్‌తో తాను వైరస్‌ను జయించానని పేర్కొన్నాడు. అయితే… తనకు వ్యాధి లక్షణాలు బయట పడే నాటికి కరోనా వైరస్‌ను గుర్తించలేదని, కానీ రెండు ఓకే విధంగా ఉన్నాయని తెలిపాడు.
ఇక తాను మూడు సంవత్సరాలుగా వూహన్‌లో ఉంటున్నానని… ఎప్పుడూ జనసంద్రోహంగా ఉండే ఈ నగరం దెయ్యాల నగరంగా మారిపోయిందన్నాడు. మాస్క్‌లు లేకుండా ఎవరూ బయటకు రావటం లేదని, వచ్చిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేస్తున్నారని తెలిపాడు. ప్రజలంతా బయటకు కాలుపెట్టడానికే జంకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు.
Advertisements
అయితే, ఇది శాస్త్రీయంగా రుజువు కావాల్సి ఉంది.