తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి పూర్తిస్థాయిలో అదుపులో ఉందని, సెప్టెంబర్ చివరి కల్లా అదుపులోకి వస్తుందన్నారు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు. ఇప్పటికే గ్రేటర్ పరిధిలో కరోనా ఉధృతి తగ్గిందని, ఆగస్టు పూర్తయ్యే నాటికి మరింత తగ్గుతుందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, 18వేల ఆక్సిజన్ పడకల కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
రాష్ట్రంలో ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స నిలిపివేసే ఉద్దేశం తమకు లేదని అయితే ప్రభుత్వ ఉత్తర్వులను పాటించాలని హెచ్చరించారు. ప్రస్తుతం 91 ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా చికిత్స కొనసాగుతుందని, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అధిక ఫీజులు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయని, ఇప్పటి వరకు దాదాపు 1039 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వాటిలో 130కి పైగా బిల్లులకు సంబంధించిన ఫిర్యాదులు ఉండగా, ఇన్యూరెన్స్‌కు సంబంధించి 16 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ ఆస్పత్రలన్నింటికి కౌన్సిలింగ్ చేస్తున్నట్లు వెల్లడించారు.