దేశంలో కరోనా ఉధృతి స్వల్పంగా తగ్గింది. గత నాలుగు రోజులుగా 45 వేలకు పైనే నమోదవుతూ వచ్చిన పాజిటివ్ కేసులు ఇవాళ మళ్లీ కొంత తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 37 వేల 975 మంది ఈ మహమ్మారి బారినపడ్డారు. దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 91.77 లక్షలు దాటింది.
కరోనా కారణంగా నిన్న కొత్తగా 480 మంది మృత్యువాతపడ్డారు. ఇప్పటివరకు ఈ వైరస్ సోకి దేశంలో లక్షా 34 వేల 218 మంది కన్నుమూశారు. ప్రస్తుతం దేశంలో 4.38 లక్షల యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న కోలుకున్న 42 వేల 314 మందితో కలిపి.. ఇప్పటివరకు 86 లక్షల మంది రికవరీ అయ్యారు.
కాగా, గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా కరోనా కేసులు 35 నుంచి 50 వేల మధ్యే నమోదవుతున్నాయి. 50 వేలకు పైగా కేసులు అరుదుగానే రిజిస్టర్ అవుతున్నాయి. దీంతో కరోనా తగ్గుముఖం పడుతోందా.. లేక పెరిగే అవకాశాలు ఉన్నాయన్న అంచనాలు కొలిక్కి రావడం లేదు.