దేశంలో కరోనా వైరస్ ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 14,849 మంది కరోనా బారినపడ్డారు. కొత్తగా 155 మంది కరోనా కారణంగా మరణించారు. అటు తాజాగా 15,948 మంది కోలుకున్నారని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15,82,201 మంది ఆరోగ్య కార్యకర్తలు కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నారు.
మొత్తం కేసులు: 1,06,54,533
యాక్టివ్ కేసులు: 1,84,408
కోలుకున్నవారు: 1,03,16,786
కరోనా మరణాలు: 1,53,339