దేశంలో కరోనా వైరస్ విజృంభణ నెల రోజులుగా ఒక తీరుగా ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 30 వేల 254 మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఇక కరోనా కారణంగా నిన్న 391 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 98 లక్షల 57 వేలకి చేరుకుంది. ఇక మరణాలు లక్షా 43 వేల19కి పెరిగాయి.
మరోవైపు రికవరీ రేటు కూడా భారీగా పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజే 33,136 మంది వైరస్ నుంచి కోలుకోవడంతో.. మొత్తం రికవరీల సంఖ్య 93.57 లక్షలకు చేరింది. దీంతో రికవరీ రేటు 94.93 శాతానికి చేరింది. ఇక గతవారం రోజులుగా రోజువారీ మరణాల సంఖ్య 500లోపే నమోదు కావడడం ఊరటనిస్తోంది. అలాగే పదిహేను రోజులుగా కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉంటున్నాయి.