దేశంలో కరోనా వైరస్ ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. గడిచిన గంటల్లో కొత్తగా 47 వేల 905 కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 86.83 లక్షలకు చేరింది. మరోవైపు కరోనా కారణంగా నిన్న 550 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకూ ఈ వైరస్‌తో చనిపోయిన వారి సంఖ్య లక్షా 28 వేల 121కి పెరిగింది.
ఇదిలా ఉంటే దాదాపు నెలరోజులకు పైగా రోజువారీ కొత్త కేసుల కంటే కోలుకుంటున్నవారే అధికంగా ఉండటం ఊరటనిస్తోంది.నిన్న ఒకేరోజు 52 వేల 718 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. దీంతో ఇప్పటివరకు 80.66 లక్షలకు రికవరీల సంఖ్య పెరిగింది. ఇక యాక్టివ్ కేసులు కూడా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 4.89 లక్షల మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.
దేశవ్యాప్తంగా నిన్న 11.93 లక్షల మందికి కరోనా పరీక్షలు చేసినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది. నవంబర్ 11 నాటికి మొత్తంగా 12.19 కోట్ల శాంపిల్స్ పరీక్షించినట్టుగా వెల్లడించింది.