ఇటు తెలంగాణలో, అటు దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కొద్ది రోజులుగా ఒకేలా కొనసాగుతోంది. స్వల్ప తేడాతో రోజువారీ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడచిన 24 గంటల్లో 612 కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇద్దరు మృతి చెందారు. దీంతో మొత్తం కేసులు 2 లక్షల 76 వేల 516 చేరుకోగా, మరణాల సంఖ్య 1,485 కు పెరిగింది.ఇప్పటి వరకు 2 లక్షల 67 వేల 427 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 7,604 యాక్టివ్ కేసులున్నాయి.
ఇటు దేశ వ్యాప్తంగానూ ఇదే పరిస్థితి నెలకొంది. ప్రతి రోజూ 30 వేలకు అటు, ఇటుగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 29 వేల 398 కేసులు నమోదు కాగా.. మొత్తం కేసులు 98 లక్షలకు చేరువయ్యాయి. కరోనా బారిన పడి నిన్న 414 మంది చనిపోగా.. మొత్తం ఇప్పటివరకూ లక్షా 42 వేల 146 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారి నుంచి సుమారు 93 లక్షల మంది డిశ్చార్జి అయ్యారు.