కరోనా బారి నుంచి ఇండియాకు త్వరలోనే విముక్తి లభించే సూచనలు కనిపిస్తున్నాయి. దేశంలో కొద్ది రోజులుగా కొత్త కేసులు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా రోజువారీ కరోనా కేసులు నాలుగు నెలల క్రితం నమోదైన కనిష్టానికి పడిపోయాయి. నిన్న ఒక్కసారిగా కొత్త కేసులు 20వేలకు దిగువకు వచ్చాయి. గడిచిన 24 గంటల్లో 9,556 కొత్త కేసులు మాత్రమే బయటపడ్డాయి. ఇంత తక్కువ స్థాయిలో గతంలో జులై నెల ప్రారంభంలో నమోదయ్యాయి.
తాజా కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు ఒక కోటీ 75 వేల 116 మంది వైరస్ బారిన పడ్డారు. ఇందులో96.36 లక్షల మంది బాధితులు ఈ మహమ్మారి నుంచి కోలుకుని బయటపడ్డారు. దీంతో ప్రస్తుతం 2.92 లక్షల కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా కరోనా కారణంగా నిన్న 301 మంది మరణించారు. ఫలితంగా కరోనా డెత్ కౌంట్ ప్రస్తుతం 1,46,111గా ఉంది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా నిన్న 10.72 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు ఐసీఎంఆర్ ప్రకటించింది.
కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం దేశంలో ప్రతి లక్ష మందిలో 7,29 మంది వైరస్ బారిన పడ్డారు. అలాగే లక్ష మంది బాధితుల్లో 10.57 మంది చనిపోయారు.