తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి తగ్గుతోంది. టెస్టుల సంఖ్య పెరుగుతున్నా… కేసులు మాత్రం తక్కువగానే నమోదవుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 51,562 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 565 పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.70 లక్షలు దాటింది.
కరోనాతో రాష్ట్రంలో నిన్న ఒకరు మృతి చెందారు. వీటితో కలిపి మొత్తం మరణాలు 1,462కి పెరిగాయి.అటు ఈ మహమ్మారి నుంచి నిన్న 925 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు 2.60 లక్షల మంది రికవరీ అయినట్టయింది. రాష్ట్రంలో ప్రస్తుతం 9,266 యాక్టివ్ కేసులు ఉన్నాయి. , వారిలో 7,219 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇప్పటి వరకు తెలంగాణలో 55.51 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.