కరోనా వైరస్ దేశ వ్యాప్తంగా ప్రభలిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే లాక్ డౌన్ విధించినప్పటికే ఏదో ఒక పని మీదనో, అవశరానికో జనాలు రోడ్డు మీదకు వస్తున్నారు. జనాలు ఒకే దగ్గర గుమిగూడి ఉండటం వలన వైరస్ వ్యాప్తి చెందుతుందన్న నేపథ్యంలో పోలీసులు లాటి జులుపిస్తున్నారు. తాజాగా పశ్చిమ జిల్లా పాలకొల్లు పట్టణం 27వ వార్డులో టిపిన్ సెంటర్ వద్ద గుమిగూడి ఉన్న జనాన్ని పోలీసులు అదిరించారు. పోలీసుల రాకతో అందరూ పరిపోయారు. టిఫిన్ చేస్తున్న వేండ్ర వీరంజనేయులు పరిగెత్తుకుంటూ వెళ్లి కాస్మో స్పోర్ట్స్ కల్చరల్ క్లబ్ లో మృతి చెందాడు.