కరోనా ఈ పేరు వింటేనే ప్రపంచం వనికిపోతుంది, కరోన విషయంలో చాలా మెసేజ్ సర్కిలెట్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో అయితే నిజం వార్తలకంటే తప్పుడు వార్తలే ఎక్కువగా సర్కిలెట్ అవుతున్నాయి. నిన్నటి దాకా బ్రహ్మంగారి కాలజ్ఞానం లో చెప్పారని ప్రచారం జరిగింది. ఇప్పుడు ఏప్రిల్ 8 నుంచి 24 వరకు గ్రహాల సంచారం బాగా లేదని దేశానికి అత్యంత క్లిష్ట కాలమని ప్రచారం జరుగుతోంది. మే 4 తరువాత గ్రహాల సంచారం మానవులకు అనువుగా మారే అవకశాలు ఉన్నాయి అంటున్నారు. పండితులు చెప్తున్నదాని ప్రకారం ఏప్రిల్ 8వ తేదీన బుధ గ్రహం మీన రాశిలోకి అడుగుపెడుతుంది… అదే సమయంలో మార్చి 29 న గురు గ్రహం మకరరాశిలోకి ప్రవేశించింది… రాజు అయిన బుధుడు నీచ స్థానంలోకి వెళ్లడం, మీనరాశి బుధ గ్రహనికి నీచ స్థానం, అక్కడ రవి కలిసి ఉండటం, ఆ తర్వాత జ్ఞాన శక్తిని ఇవ్వాల్సిన గురువు కూడా నీచ స్థానంలోకి వెళ్లిపోవడం, అందులోను పాప గ్రహమైన కుజుడు ఉచ్ఛ స్థానం ఇవ్వడం, కుజుడికి పాప గ్రహం, కుజుడికి మకరరాశి ఉచ్చ స్థానం. శని గ్రహానికి స్వక్షేత్రం. శని, కుజుడు కూడా కలిశారు. శని, కుజుడు కలిస్తే యుద్ధ ప్రభావం ఏర్పడుతుందని అర్థం. అదే విదంగా శనిగ్రహ దృష్టి బుద్ధుడి మీద 3 వ స్థానం దృష్టి పడుతుంది. మొత్తం మీద ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 24 వరకు దేశంలో అత్యంత హేయమైన పరిస్థితులు నెలకొంటాయని చెప్పవచ్చు. ఈ సమయంలో ప్రజలు సంయమనం పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే బుధుడు ఎప్పుడైతే నీచంలోకి పడిపోయి, శని దృష్టి ప్రబలి, శని ఎప్పుడైతే ప్రబలవంతుడు అయ్యాడో, అప్పుడు దుష్టశిక్షణ చెయ్యడానికి, ముందుకు బయలుదేరుతాడు. ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటించకుండా , హింసా మార్గాన్ని అనుసరిస్తారో, వారికి మరింత ప్రమాదకరమైన సమయమని చెప్పవచ్చు అని పండితులు చెప్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
బుధుడు నీచ స్థానంలో ఉన్నాడంటే వైరస్ ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది.. మే 4 వ తేదీ వరకు ఈ వైరస్ ప్రబలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాదాపుగా ఏప్రిల్ నెల అంతా దేశ ప్రజలకు ఒక పీడకలలా ఉండిపోతుంది. ఆర్థిక నష్టాలతో పాటు… గుంపులు గుంపులుగా ఎక్కడికీ వెళ్లలేరు…ఎవరినైనా కలుద్దామన్నా, ఎవరితోనైనా మాట్లాడధమనుకున్నా, అనుమానంగానే ఉంటుంది. సినిమా రంగం కుదేలైపోతుంది. తర్వాత ప్రజా వ్యవస్థలో చాలా రంగాలు కుదేలైపోతాయి.. దేశ ఆర్థిక వ్యవస్థ దాదాపు క్షీణించేపోయే స్థితికి వస్తుంది. . మే 4వ తేదీ కాస్త శుభ పరిణామాలు ఉండే అవకాశం ఉంది. అప్పటినుంచి ఆర్థిక అందరి పరిస్థితులు మారతాయి. ఎప్పుడైతే బుద గ్రహం క్రమేణా మారిపోయి, మేష రాశి లోకి అడుగు పెడతాడో, రవి గ్రహం కూడా అప్పటికి మేష రాశిలోకి వస్తాడు కాబట్టి మళ్ళీ పుంజుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఏప్రిల్ నెల మొత్తం కాస్త సంయమనంగా ఉండాలి అని మే 4 తరువాత అంత సర్దుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు పండితులు. నిజమో అబద్ధమో కానీ ప్రజలు అందరు ఏప్రిల్ నెల మొత్తం జాగ్రత్తగా ఇంట్లోని ఉండడమే మంచిది.