భారతదేశంలో కరోనా దండయాత్ర కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. గడిచిన 24 గంటల్లో 3,277 మందికి కొత్తగా కరోనా సోకిన సోకింది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 127 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,109కి చేరింది.
కొత్తగా 3,277 మందికి కొత్తగా కరోనా సోకటంతో కేసుల సంఖ్య మొత్తం 62,939కి చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 19,358 మంది కోలుకోగా ఆసుపత్రుల్లో 41,472 మంది చికిత్స పొందుతున్నారు.