కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎంపీల జీతాల్లో 30 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది.12 నెలల పాటు కోత విధిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. అదే విధంగా ఎంపి నిధులు రాబోయే రెండు సంవత్సరాలు అంటే 2020-21, 2021-22 కేటాయించలేమని నిర్ణయం తీసుకుంది.
ఎంపిలు, మంత్రులు, ప్రధానమంత్రికి కూడా ఈ నిర్ణయాలు వర్తిస్తాయి.రాష్ట్రపతి , ఉపరాష్ట్రపతి స్వచ్చందంగా 30 శాతం జీతం ఏడాది పాటు వదులుకున్నారని ప్రకాష్ జవదేకర్ చెప్పారు.అన్ని రాష్ట్రాల గవర్నర్లకు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుంది.త్వరలోనే దీనికి సంబంధించిన ఆర్డినెన్సు రాబోతోంది.
లాక్ డౌన్ ఎత్తివేసే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామన్నారు.ఎంపి నిధులు దాదాపు 7900 కోట్ల రూపాయలు కరోనా కట్టడికి ఉపయోగిస్తామని కేంద్రం వెల్లడించింది.