కరోనా వ్యాప్తితో జనం థియేటర్లు, మల్టిప్లెక్స్‌లకు దూరంగా ఉంటున్నారు. దాదాపు దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. మార్చి 31వరకు థియేటర్లకు తాళం వేసినట్లే. ఆ తర్వాత పరిస్థితిని బట్టి ఆయా ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోబోతున్నాయి. ఈ కారణంగా భారతీయ చలన చిత్ర పరిశ్రమ దాదాపు 8వేల కోట్ల మేర నష్టపోయినట్లు సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కేవలం సినిమా టికెట్ల అమ్మకాలపైనే 4వేల కోట్లు, జీఎస్టీ లాస్‌లో వెయ్యి కోట్లు, థియేటర్లలో ఫుడ్, పార్మింగ్, ఇతర ఖర్చుల్లో 2వేల కోట్లు ఆవిరి కాగా… వాణిజ్య ప్రకటనల్లో మరో వెయ్యి కోట్లు వెరసి 8వేల కోట్లు నష్టపోయినట్లు తెలుస్తోంది.
అయితే… షూటింగ్‌ల రద్దు, కొత్త సినిమాల రిలీజ్‌తో నిర్మాత ఆర్థిక భారం అవన్నీ ఇంకా అదనమే.