దేశం మొత్తాన్ని కరోనా వైరస్ వణికిస్తుంటే, ఢిల్లీ వాసులకు మాత్రం ఊపిరి పీల్చుకునే లా చేస్తోంది.కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్ డౌన్ లో ఉంది.రవణా వ్యవస్థ స్తంభించింది.పరిశ్రమలు మూతపడ్డాయి.కాలుష్యం లేకుండా స్వచ్చమైన వాతావరణం ఉంది.సంవత్సరం మొత్తం
స్వచ్చమైన గాలి పీల్చని ఢిల్లీ వాసులకు కరోనా వైరస్ పుణ్యమాని వరుసగా మూడో వారం క్లీన్ ఏర్ తీసుకుంటున్నారు.
ఢిల్లీ లో మొత్తం గాలి నాణ్యత సూచిక ప్రస్తుతం 82 వద్ద ఉంది, ఇది సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ (SAFAR) ప్రకారం స్వచ్చమైన గాలిగా చెప్పొచ్చు అంటున్నారు నిపుణులు.దీనికి ముందు ఏర్ క్వాలిటీ ఇండెక్స్ 159 గా ఉండేది.
2018 ,19 తో పోలిస్తే ఈ సంవత్సరం స్వచ్చమైన గాలిని ఢిల్లీ వాసులు పీలుస్తున్నారని నిపుణులు అంటున్నారు. ప్రయాణాలు, పరిశ్రమల తగ్గింపు కారణంగా ఇది సాధ్యమైందన్నారు.