కరోనా ఎఫెక్ట్ బుల్లితెరకు కుడా తాకింది. కరోనా కారణంగా ఇప్పుడు జబర్దస్త్ కొత్త ఎపిసోడ్ లు చేయడంలేదు. ఈ పరిణామం జబర్దస్త్ ఆర్టిస్టులకు షాక్ అనే చెప్పుకోవాలి. లాక్ డౌన్ తో సినిమా షూటింగ్ లు ఎక్కడిక్కడే నిలిచిపోగా.. తాజాగా అందర్నీ ఎంటర్ టైన్ చేస్తోన్న జబర్దస్త్ కు కుడా బ్రేక్ పడింది. ఇక లాక్ డౌన్ కారణంగా జబర్దస్త్ ఆర్టిస్టులు ఇంటికే పరిమితమవ్వాల్సి వచ్చింది. జబర్దస్త్ నే నమ్ముకొన్న చిన్నస్థాయి ఆర్టిస్ట్లులు కొత్త ఎపిసోడ్స్ లేక ఇబ్బందులను పడుతున్నారట. అటు చేయడానికి ఈవెంట్స్ లేక, ఇటు చేయడానికి జబర్దస్త్ లో కొత్త ఎపిసోడ్ లు లేక సతమతం అవుతున్నారట.
ఈ లాక్ డౌన్ పీరియడ్ మరికొన్నిరోజులు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి జబర్దస్త్ ఫేమ్స్ అయినటువంటి సుడిగాలి సుధీర్, హైపర్
ఆదిలతోపాటు ఈ కామెడిషోకు యంకర్లుగా వ్యవహరిస్తోన్న అనసూయ, రష్మీలకు ఈ లాక్ డౌన్ తో ఎలాంటి ఆర్ధిక సమస్య లేదు. ఉన్నదల్లా జబర్దస్త్ లోని చిన్నస్థాయి ఆరిస్టులకు మాత్రమే ఆర్ధిక ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఎపిసోడ్ చొప్పున పేమెంట్ అందుకొనే వీరంతా షూటింగ్స్ లేక భవిష్యత్ పై టెన్షన్ పడుతున్నారు. జబర్దస్త్ నే నమ్ముకొన్న తమను యాజమాన్యమే ఆదుకోవాలని కోరుతున్నారు. జబర్దస్త్ కామెడిషోతో ఎలాంటి చీకు చింత లేకుండా బ్రతుకుతోన్న తమకు కరోనా కొత్త కష్టాలు తెచ్చిపెట్టిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి జబర్దస్త్ చిన్నస్థాయి ఆర్టిస్ట్ ల విన్నపాలపై ఎలా స్పందిస్తోందో చూడాలి