కరోనావైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దీని సెగ WWE కు తగిలింది. ‘రెసిల్ మేనియా’ ఈ సంవత్సరం ఖాళీ స్టేడియం లోనే జరుగుతుంది. రెసిల్ మేనియా 36 ఇప్పుడు మొదట అనుకున్నట్లుగా టాంపా బేలో కాకుండా ఫ్లోరిడాలోని ఓర్లాండోలోని డబ్ల్యూడబ్ల్యూఇ పెర్ఫార్మెన్స్ సెంటర్లో జరుగుతుందని అధికారికంగా ప్రకటించింది. స్థానిక భాగస్వాములు మరియు ప్రభుత్వ అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపింది. రెసిల్ మేనియా ఏప్రిల్ 5 ఆదివారం సాయంత్రం 7 గంటలకు ప్రత్యక్ష ప్రసారం అవుతుందని ఆ సమయం లో అక్కడ శిక్షణా కేంద్రంలో అవసరమైన సిబ్బంది మాత్రమే ఉంటారు “అని డబ్ల్యూడబ్ల్యుఇ అధికారిక ప్రకటనలో తెలిపింది.
అయితే రెసిల్ మేనియా మ్యాచ్ చూడడానికి ప్రపంచం వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు వస్తారు. అయితే కరోనా ప్రభావం కారణంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాల నుండి వచ్చే వారిపై 30 రోజుల నిషేధం విధించారు. ఆ ప్రభావం ఇప్పుడు ఈ రెసిల్ మేనియా ఫై పడబోతోంది. ఈ సంవత్సరం జరగబోయే రెసిల్ మేనియా ఈవెంట్ లో జాన్ సినా, బ్రే వ్యాట్, బ్రాక్ లెస్నర్, గోల్డ్‌బర్గ్, రోమన్ రైన్స్ వంటి స్టార్స్ అందరూ పాల్గొంటున్నారు. అయితే ఈ కరోనా కారణంగా ఇప్పటికే క్రీడా టోర్నీలు అని వాయిదాపడుతున్నాయి.