కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 వరకూ గూడ్స్ రైళ్లు మినహా అన్ని రైళ్ల సేవలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. మార్చి 31 అర్ధరాత్రి వరకూ రైళ్ల సేవలను నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది.