దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య కోటికి చేరువైంది. దాదాపుగా రేపటితో ఈ మార్క్‌ను చేరుకోనుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా నమోదైన 22,889 కరోనా పాజిటివ్ కేసులతో.. దేశంలో మొత్తం బాధితుల సంఖ్య 99 లక్షల 74 వేల 447కు చేరింది. కరోనా కారణంగా కొత్తగా 338 మంది మరణించగా.. దేశంలో ఇప్పటివరకు లక్షా 44 వేల 789 మంది ఈ మహమ్మారికి బలయ్యారు.
కరోనా బారి నుంచి ఇప్పటివరకు దేశంలో 95.20 లక్షల మంది బాధితులు కోలుకున్నారు. మిగిలిన 3.13 లక్షల మంది చికిత్స పొందుతున్నారు. దేశంలో రికవరీ రేటు 95.31 శాతం, మరణాల రేటు 1.45 శాతం ఉన్నట్టు కేంద్ర వైద్యారోగ్యశాఖ తెలిపింది. కాగా దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా దాకా 15.89 కోట్ల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.