దేశంపై కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతోంది. మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో ఈ మహమ్మారి కోరలు చాస్తోంది. ఫలితంగా దేశవ్యాప్తంగా మరోసారి భారీ స్థాయిలో కేసులు వెలుగుచూస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 22,854 మంది కరోనా వైరస్ బారినపడ్డారు. మరోవైపు కరోనాకు చికిత్స పొందుతూ నిన్న 126 మంది ప్రాణాలు కోల్పోయారు.
దేశంలో ఇప్పటివరకు నమోదైన కేసులు: 1,12,85,561
మొత్తం రికవరీలు: 1,09,38,146
యాక్టివ్ కేసులు: 1,89,226
మొత్తం మరణాల సంఖ్య: 1,58,189అటు తెలంగాణలోనూ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.గత 24 గంటల్లో 37,904 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా.. 194 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు 3,00,536 కేసులు నమోదయ్యాయి. అటు కరోనా కారణంగా నిన్న రాష్ట్రంలో ముగ్గురు మృతిచెందారు. దీంతో మొత్తం మరణాలు 1649కు పెరిగాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1,855 యాక్టివ్ కేసులు ఉన్నాయి.