ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతున్న యూకే స్ట్రెయిన్ కరోనా.. కొద్దిరోజులుగా ఇండియాలోనూ ఆందోళన కలిగిస్తోంది. చూస్తుండగానే.. స్వల్ప వ్యవధిలో దేశంలో కొత్త రకం కరోనా కేసులు 90కి పెరిగాయి. గడిచిన కొద్ది రోజులుగా క్రమంగా పెరుగుతూ వచ్చిన కేసులు..గత 24 గంటల్లో మాత్రం ఒక్కటీ బయటపడలేదు. దీంతో ప్రస్తుతం యూకే వెరియంట్ కేసులు 90 వద్దే స్థిరంగా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది.
యూకే స్ట్రెయిన్ ఇప్పటికే 30 కి పైగా దేశాలను చుట్టేసింది. ఆయా దేశాల్లో నిత్యం వందలాది మందిలో ఇది కనపిస్తోంది. పాత రకం కంటే.. కొత్త రకం వైరస్ మరింత వేగంగా విస్తరిస్తోంది. పైగా దాని తీవ్రత కూడా గతంతో పోలిస్తే అధికంగా ఉంది. ఈ క్రమంలో దేశంలో ఈ రకం కేసుల్లో నిన్న ఎలాంటి పెరుగుదల లేకపోవడం ఊరటనిస్తోంది.